Harbhajan Singh has already prophesied that he could well be the next ‘million-dollar baby’ in the upcoming IPL and there is merit to his prediction.
#IPL2019
#IndiaVsWestIndies2018
#3rdODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune

వయసు 21 ఏళ్లు. ప్రస్తుతం భారత పర్యటనలో పరుగుల వరద పారిస్తోన్న వెస్టిండిస్ బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మెయిర్ ఐపీఎల్-2019 సీజన్‌కు మిలియన్ డాలర్ బేబీ కానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో హెట్‌మెయిర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించి తమ జట్టు భారీ స్కోర్ చేసేలా చేశాడు. ఇక, విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో దాదాపు భారత్‌ను ఓడించినంత పనిచేశాడు.
హెట్‌మెయిర్ ప్రదర్శనకు భారత మాజీ, సీనియర్ క్రికెటర్లతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో హెట్‌మెయిర్ ఐపీఎల్-2019 సీజన్‌లో భారీ ధరనే పలకబోతున్నాడని అంచనా వేస్తున్నారు. భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అయితే వచ్చే ఐపీఎల్ సీజన్‌కు హెట్‌మెయిర్ మిలియన్ డాలర్ బేబీ అని పేర్కొన్నాడు. అతడి కోసం కోసం ముఖ్యంగా మూడు ఫ్రాంచైజీలు పోటీపడతాయని అన్నాడు.